గంటకు 264 కిలోమీటర్ల వేగం: డ్రైవర్ పట్టివేత
- April 01, 2019
ఎమిరేట్స్ రోడ్డుపై గంటకు 264 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న ఓ కారుని పోలీసులు అడ్డుకున్నారు, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు డ్రైవర్లను కూడా ఈ సందర్భంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీరంతా తమ వాహనాల్ని నడుపుతున్నారని అధికారులు పేర్కొన్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి మాట్లాడుతూ, ఫిక్స్‌డ్ అలాగే మొబైల్ రాడార్ల ద్వారా అతి వేగంతో దూసుకెళ్ళే వాహనాల్ని పసిగట్టగలమని చెప్పారు. అరెస్టయినవారిలో అత్యధిక వేగంతో వెళుతున్న యువకుడి కారు వేగం గంటకు 264 కీలోమీటర్లుగా రిజిస్టర్ అయ్యింది. మిగతావారి వేగం 247, 244, 243, 232 అలాగే 222 కిలోమీటర్ల వేగం గంటకు నమోదయ్యింది. ఇంత వేగంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతున్నారు వాహనదారులు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..