ఏప్రిల్ 7న 9 కొత్త బస్ రూట్స్ ప్రారంభించనున్న దుబాయ్ ఆర్టిఎ
- April 02, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఏప్రిల్ 7 నుంచి కొత్తగా 9 బస్ రూట్స్‌ని ప్రారంభించనుంది. అల్ వర్సాన్ 3 నుంచి అల్ నధాకి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 మీదుగా వెళ్ళే రూట్ 20 ఇందులో మొదటిది. రష్దియా మెట్రో స్టేషన్ మరియు ఇంటర్నేషనల్ సిటీని ప్రరతి 30 నిమిషాలకు ఓ బస్ కలిపేలా ఈ రూట్‌ని డిజైన్ చేశారు. రెండో రూట్ ఇ201, అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుంచి అల్ అయిన్ బస్ స్టేషన్‌కి వెళుతుంది. రూట్ జె02, ఇంటర్నేషనల్ మీడియా జోన్‌ని అరేబియన్ రాంచెస్ని దుబాయ్ స్టూడియో సిటీ వయా కలుపుతుంది. రూట్ 310 రష్దియా మెట్రో మరియు బస్ స్టేషన్ నుంచి ఇంటర్నేషనల్ సిటీని కలుపుతుంది. రూట్ 320 రష్దియా మెట్రో బస్ స్టేషన్ నుంచి సిలికాన్ ఒయాసిస్ / అకడమిక్ సిటీని కలిపేలా డిజైన్ చేశారు. రూట్ ఎఫ్34, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి దుబాయ్ ప్రొడక్షన్ సిటీ వైపు వెళుతుంది. రూట్ ఎఫ్37 మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మెట్రో స్టేషన్‌ని దుబాయ్ స్పోర్ట్స్ సిటీతో కలుపుతుంది. రూట్ 315 ఎటిసలాట్ మెట్రో స్టేషన్‌ని షార్జాలోని ముబైలెహ్ బస్ స్టేషన్‌ని కలుపుతుంది. రూట్ ఇ316, రష్దియా మెట్రో స్టేషన్‌ని యూనివర్సిటీ ఆఫ్ షార్జాని కలిపేలా తీర్చిదిద్దారు. కాగా, ఆర్టీయే కొన్ని బస్ రూట్స్‌లో మార్పుల్ని కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







