భారత కేంద్రం శుభవార్త.. రిటైర్మెంట్ సమయంలో అత్యధిక పెన్షన్
- April 02, 2019
ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మేలుచేసే తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ అందుకునేలా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సోమవారం కేరళ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్‌వో చేసిన అప్పీల్‌ను ధర్మాసనం తిరస్కరించింది. తాజా ఆదేశాలతో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అధిక పెన్షన్ రానుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి వేతనం ప్రాతిపదికన పెన్షన్ అందించాలని కేరళ హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎఫ్‌వో దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తలుపుతట్టింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో 15 వేల రూపాయల ప్రాతిపదికన పెన్షన్ మాత్రమే చెల్లిస్తోంది. దీనిపై గతంలో కోర్టును ఆశ్రయించగా కేరళ హైకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. చివరి వేతనం ఆధారంగానే పెన్షన ఇవ్వాలని సూచించింది. దీనిపై పిఎఫ్ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది.
సుప్రీం కోర్టులో ఈపీఎఫ్‌వో అప్పీల్ తిరస్కరణ నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ కొన్ని వందల శాతం పెరగనుంది. అదేసమయంలో ప్రావిడెంట్ ఫండ్ వాటా కూడా తగ్గొచ్చు. అదనపు కంట్రిబ్యూషన్ అనేది పీఎఫ్‌కు కాకుండా ఈపీఎస్‌కు వెళ్తుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ప్రారంభించింది. ఇందులో కంపెనీ ఉద్యోగి వేతనంలో 8.33 శాతాన్ని పెన్షన్ స్కీమ్‌లో జమచేయాలి. అయితే ఈ కంట్రిబ్యూషన్ రూ.6,500లో 8.33 శాతానికి మాత్రమే పరిమితం. అంటే ఈపీఎస్ అకౌంట్‌కు నెలకు గరిష్టంగా 541 మాత్రమే జమవుతాయి. 2014 సెప్టెంబర్ 1న మళ్లీ ఈపీఎఫ్‌వో ఈపీఎస్ నిబంధనలను సవరించింది. గరిష్టంగా 15 వేలరూపాయలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు జమ చేసుకోవచ్చని మార్పులు చేసింది. అంటే నెలకు గరిష్టంగా 12వందల ఈపీఎస్ ఖాతాకు జమవుతుంది. పూర్తి వేతనంపై పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే.. గత ఐదేళ్ల వేతనం సగటు ప్రాతిపదికన పెన్షన్ ఉంటుందని తెలిపింది. అంతేకానీ గత ఏడాది కాలపు వేతనం సగటును ప్రాతిపదికన తీసుకోబోమని పేర్కొంది. దీంతో కొందరు ఉద్యోగుల కేరళ కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో కోర్టు ఈపీఎఫ్‌వో 2014 సెప్టెంబర్ 1 మార్పులను పక్కనపెట్టింది. పాత విధానాన్నే అనుసరించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఈపీఎఫ్‌వో సుప్రీం కోర్టుకు వెళ్లింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..