అల్సర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే..
- April 03, 2019
కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాం అల్సర్‌ను దూరం చేస్తుంది. టైమ్‌కి తినకపోవడం, అధిక కారంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం అల్సర్‌కు దారితీస్తుంది. అందుచేత అల్సర్‌ను దూరం చేసుకోవాలంటే కొబ్బరిబోండాంను తీసుకోవాల్సిందే.
కొబ్బరిబోండాంలోని నీటిని ఉదయం-సాయంత్రం తీసుకుంటే అల్సర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీర ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కంటికి మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలను నయం చేస్తుంది.
కడుపులో మంట, ఛాతిలో మంట, వేవిళ్ళు వంటి లక్షణాలు తెలియవస్తాయి. ఈ లక్షణాలు తెలియవస్తే.. చాక్లెట్, కూల్ డ్రింక్స్, మద్యపానం, పెప్పర్‌మింట్, కాఫీ, బ్లాక్ టీ, ఆరెంజ్, ద్రాక్ష, వెల్లుల్లి, మిరప, పాల ఉత్పత్తులు, కారపు పదార్థాలు తీసుకోకపోవడం మంచిది.
ఇక మధ్యాహ్నం పూట కొబ్బరిబోండాం నీటిని తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. పచ్చకామెర్లు, కలరా, చికెన్ ఫాక్స్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
గోధుమలు, చికెన్, ఫిష్, బీన్స్, కోడిగుడ్డు, పెరుగు, మేడిపండును తీసుకోవచ్చు. కానీ చక్కెర, కొవ్వు అధికంగా గల ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేయాలి. ఉప్పును కూడా తగ్గించాలి. వీటితో పాటు కొబ్బరిబోండాం అల్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







