మలేసియాలో భారీ జలస్తంభం

- April 03, 2019 , by Maagulf
మలేసియాలో భారీ జలస్తంభం

ఒక మలేసియా దీవి సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఒక భారీ జల స్తంభం కనిపించింది. పెనాంగ్ ద్వీపంలోని కొందరు ప్రత్యక్షసాక్షులు తీరం దాటే ముందు సముద్రంలో ఆకాశాన్ని తాకుతున్నట్టు నాటకీయంగా ఏర్పడిన జల స్తంభాన్ని చిత్రీకరించారు. ఈ ప్రకృతి వింత తాలూకు ఫోటోలు, వీడియోలు ఇప్పడు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి.

ఛానెల్ న్యూస్ ఏషియా ప్రకారం తాంజుంగ్ టోకోంగ్ తీరాల దగ్గర జల స్తంభం దాదాపు ఐదు నిమిషాల పాటు సుళ్లు తిరుగుతూ కనిపించింది. ఆ తర్వాత కదిలి తీరం దాటింది. జలస్తంభాలు కూడా టోర్నడోల వంటివేనని ఒకసారి భూమిని తాకిన తర్వాత అవి కూలిపోతాయని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com