హత్య కేసులో వలసదారుడి అరెస్ట్‌

- April 03, 2019 , by Maagulf
హత్య కేసులో వలసదారుడి అరెస్ట్‌

మస్కట్‌: అరబ్‌ జాతీయుడైన ఓ వలసదారుడ్ని హత్య కేసులో అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. అయితే అతడు ఏ దేశానికి చెందినవాడన్న ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. మిలిటరీ, సెక్యూరిటీ యూనిట్స్‌ సంయుక్తంగా నిందితుడ్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. విలాయత్‌ ఆఫ్‌ తమ్రాత్‌లో జరిగిన ఓ హత్యకేసులో ఈ వ్యక్తి నిందితుడిగా వున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com