కన్నూర్ - బహ్రెయిన్ సర్వీస్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
- April 03, 2019
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (బిఐఎ) ఆపరేటర్ మరియు మేనేజింగ్ బాడీ బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ (బిఎసి), ఇండియాలోని కన్నూర్ నుంచి బహ్రెయిన్‌కి చేరుకున్న తొలి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ఘనంగా స్వాగతం పలికింది. కన్నూర్ నుంచి తొలి డైరెక్ట్ విమానం బహ్రెయిన్‌కి ఇదే. టూరిజం రంగంలో మరింత వృద్ధికి ఈ విమాన సర్వీసు ఊతమిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బిఎసి డెలిగేషన్, తొలి విమానానికి స్వాగతం పలికింది. ఇందులో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యమాన్ జైనాల్ వున్నారు. బహ్రెయిన్‌లో ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కంట్రీ మేనేజర్ సాకెత్ సరన్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎయిర్ ఇండియా సబ్సిడరీ అయిన ఈ ఎయిర్‌లైన్, కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి వారంలో రెండు రోజులపాటు సర్వీసుల్ని నడపనుంది. ఈ రూట్లో కువైట్ ఓ స్టాప్‌గా వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..