పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళాడు..చివరకు..
- April 07, 2019
తెలంగాణ చెందిన యువతి ఆమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి అమెరికాలోని టెక్సాస్‌లో
గొంతు కొసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. తొర్రూరు మండలంలోని చింతలపల్లికి చెందిన సెగ్గెం మహేందర్, విమలమ్మ దంపతులకు ముగ్గురు కూమర్తెలు.
అయితే ఎనిమిది నెలల క్రితం వీరి చిన్న కుమార్తె సంధ్యను తొర్రూరుకు చెందిన సమీప బంధువు దూంపల్లి శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. యుఎస్‌లో సాప్ట్వేర్ ఇంజీనిర్గా పనిచేస్తున్న శ్రీకాంత్ తన తల్లిదండ్రులతొ కలిసి అక్కడే నివాసిస్తున్నాడు. వివాహం అనంతరం భార్యను కూడా అక్కడికి తీసుకెళ్ళాడు. ఆరు నెలల వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. కొద్దినెలల నుంచి సంధ్యను అదనపు కట్నం కోసం శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో మనస్థాపం చెందిన ఆమె గొంతు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. గదిలో విగితా జీవిగా పడిఉన్న సంధ్య చూసిన శ్రీకాంత్ తను అత్మహత్య చేసుకున్నట్లు భారత్‌లోని ఆమె బంధువులకు తెలియజేశాడు. అనంతరం సంధ్య తండ్రి మహేందర్ తొర్రూరు పోలీసు స్టేషన్లో శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







