నేను అంతంత రెమ్యునరేషన్ ఎందుకు అడిగేవాడినో తెలుసా!

- April 07, 2019 , by Maagulf
నేను అంతంత రెమ్యునరేషన్ ఎందుకు అడిగేవాడినో తెలుసా!

భార‌తీయ సినీ జ‌గ‌త్తులో ఒక అద్భుత‌మైన నటుడు. కోట్లాది మంది ప్రజలను తన నటనతో నవ్వించిన హాస్య బ్రహ్మ. అత‌డే జ‌గ‌మంత కుటుంబమై అల్లుకుపోయిన క‌న్నెగంటిబ్ర‌హ్మానంద‌చారి. అలియాస్ బ్ర‌హ్మానందం. ఇటీవల ఆయన గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాస్త కోలుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్దమవుతున్నారు. ఈ తరుణంలో ఆయన ప్రముఖ తెలుగు పత్రికతో తన అనుభవాలను పంచుకున్నారు.
 
“అనారోగ్యం కారణంగా ఎప్పుడు నటనకు దూరం కాలేదు, అసలు నిజంగా అనారోగ్యం అనేది నాకు తెలీదు. కానీ కొంత కాలం క్రితం గుండెలో నొప్పిగా అనిపించడంతో డాక్టర్‌ను సంప్రదించాను. వారు గ్యాస్ట్రిక్‌ సమస్య అని చేప్పారు. కొన్ని పరీక్షలు చేసిన అనంతరం స్టంట్‌ వేయాల్సిన అవసరం రావొచ్చున్నారు. దీంతో ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించుకుని వచ్చా’’

“అలాగే నా అనారోగ్యం వల్ల కొన్ని గొప్ప విషయాలు తెలిశాయి నన్ను ప్రేక్షకులు ఎంత అభిమానిస్తున్నారో తెలిసింది. నా గురించి వాళ్ళు పూజలు చేశారంటే ఇంకేం కావాలి? వాళ్లకు నేను ఏమవుతాను?నేనింకా ఏం సాధించాలి. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పడం మినహా నేను ఇంకేం చేయగలను. నా అనారోగ్యం నా అజ్ఞానాన్ని కూడా తొలగించింది. కొన్ని పాత్రలు నచ్చకపోతే పారితోషికం ఎక్కువ అడిగి భయపెట్టేసేవాణ్ని ,ఇప్పుడు అది ఎంత అజ్ఞానమే తెలిసింది. నా ఆలోచనా ధోరణి మారింది. నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచాలని నిర్ణయించుకున్నాను. ఇక వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంటా నాలోని ఏనాడూ రిటైర్‌మెంట్‌ ఇవ్వను” అంటూ సరదాగా ముఛ్చంటిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com