ఉత్సాహంగా ఉ.కొరియా వార్షిక మరథాన్
- April 07, 2019
సియోల్: ఉ.కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఆదివారం నిర్వహించిన నగర వార్షిక మరథాన్‌లో దాదాపు రెట్టింపు సంఖ్యలో విదేశీ పర్యాటకులు పాల్గొన్నారని నగరంలోని పర్యాటక సంస్థలు వెల్లడించాయి. ఉ.కొరియా వ్యవస్థాపకుడు కిమ్-ఇల్-సంగ్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ మరథాన్‌ను నిర్వహించారు. గత ఏడాది మరథాన్‌లో 450 మంది పర్యాటకులు పాల్గొనగా ఈ ఏడాది పశ్చిమ దేశాలకు చెదిన దాదాపు 950 మందికి పైగా పర్యాటకులు పాల్గొన్నారని పర్యాటక రంగ సంస్థ కొర్యో టూర్స్ వెల్లడించింది. అమెరికా బెదిరింపులు, ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఉ.కొరియాకు పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







