టీవీ చర్చలో యాంకర్‌పై..

- April 07, 2019 , by Maagulf
టీవీ చర్చలో యాంకర్‌పై..

అది టీవీ డిబేట్..లక్షలాది మంది చూస్తారన్న కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తాడో నాయకుడు. మాటల్లో చూపించిన ఆవేశాన్ని చేతల్లో చూపించాడు. ఓ టీవీ చానెల్‌లో సీరియస్‌గా చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు సహనం కోల్పోయారు. అతన్ని..బీజేపీ నేత దేశద్రోహి అనడంతో ఒకసారిగా కోపంతో ఊగిపోయాడు. వెంటనే చేతులకు పని చేప్పాడు. నీళ్ల గ్లాస్‌ తీసుకుని ప్రత్యర్థిపైకి విసిరేశాడు. దీంతో బీజేపీ నేత మీద ఆ నీళ్ళు కాస్త టీవీ యాంకర్‌తో పాటు అందరీపై పడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 ఓ ప్రైవేటు టీవీ చానెల్‌ “భారత ఆర్మీ- ప్రస్తుత ఎన్నికలు” అనే అంశంపై లైవ్‌ చర్చ నిర్వహించింది. ఈ డిబెట్‌లో బీజేపీ నుంచి కేకే శర్మ, కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అలోక్‌ శర్మ, పలువురు విశ్లేఫకులు పాల్గోన్నారు. ఈ చర్చలో అలోక్‌-శర్మల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అలోక్‌ శర్మను ఉద్దేశించి బీజేపీ నేత కేకే శర్మ ‘దేశద్రోహి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన అలోక్‌ శర్మ అసభ్య పదజాలంతో అతనిపైకి ఎదురుగా ఉన్న నీళ్ల గ్లాస్‌ను విసిరేశారు. ఈ క్రమంలో స్టూడియోలో ఉన్నవారందరిపై నీళ్లు పడ్డాయి. అలోక్‌ శర్మ ఆవేశాన్ని చూసి యాంకర్‌తోపాటు మిగతా ప్యానెలిస్టులు బిత్తరపోయారు. అనంతరం ఇద్దరు నేతలను చర్చను బహిష్కరించి యాంకర్‌ మిగతా చర్చను కొనసాగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com