2015లో రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం ..
- December 30, 2015
2015లో జోరుగా ఆస్తుల క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్‌శాఖకు భారీగా ఆదాయం తాడికొండ (గుంటూరు), డిసెంబరు 30 రాజధాని ప్రాంతంలో ఈ ఏడాది స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడికొండ, అమరావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని 29 గ్రామాలను ప్రభుత్వం రాజధానికి ఎంపిక చేసింది. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 2015లో 30 వేల పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్‌పరిధిలో దాదాపు 18 వేల రిజిసే్ట్రషన్లు జరగ్గా, తాడికొండ పరిధిలో 8 వేలు, అమరావతి పరిధిలో 6 వేల పైచిలుకు రిజిసే్ట్రషన్లు జరిగినట్లు అధికారిక సమాచారం. ఈ మూడు కార్యాలయాల పరిధిలో ఈ ఏడాది రిజిసే్ట్రషన్ శాఖకు దాదాపు రూ.10 కోట్లపైగా ఆదాయం సమకూరినట్లు అంచనా. రాజధాని 29 గ్రామాల రైతులు భూసమీకరణలో రాజధానికి భూములిచ్చినా.. 40 శాతం మంది రైతులు తిరిగి ఇతరులకు విక్రయించుకున్నట్లు తెలుస్తోంది. సమీకరణలో భూమి ఇచ్చినా.. రైతు భూమిని అమ్ముకునే హక్కును ప్రభుత్వం కల్పించడంతో ఆ విధంగా భూమి చేతులు మారింది. మెట్ట ప్రాంతంలో ఎకరం రూ.1.30 కోట్లు, జరీబులో ఎకరం రూ.2.5 కోట్ల వరకు ధరలు పలికాయి. అయితే రాజధాని గ్రామాల్లో రిజిసే్ట్రషన విలువ ఎకరం రూ.4 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది. రాజధాని ప్రకటించినా.. ఆయా గ్రామాల్లో భూముల విలువను పెంచలేదు. అయితే రాజధానిలో రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి చేసి, రైతులకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భారీ విలువలతో అనేక మంది భూములను కొనుగోలు చేశారు. జనవరి నుంచి మే వరకు ఊపుగా రిజిసే్ట్రషన్లు జరిగాయి. జూనలో రాజధాని భూమి పూజ జరిగాక, రిజిసే్ట్రషన్లు తగ్గాయి. మళ్లీ అక్టోబర్‌లో రాజధాని శంకుస్థాపనకు ముందు రిజిసే్ట్రషన్లు జోరుగా సాగాయి. తర్వాత అడపాదడపా జరుగుతున్నా.. ఏడాది మొత్తంలో భూముల క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు ద్వారా రిజిసే్ట్రషనశాఖకు భారీగా ఆదాయం సమకూరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







