మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..
- April 08, 2019
ఎవరికి ఓటేస్తారో తరవాత సంగతి. ముందు మీకు ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా మూడు రోజులే ఉంది. మీరు చెక్ చేసుకోవడంతో పాటు మరికొంత మందికి ఈసమాచారాన్ని తెలియజేయండి. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరునిగా మీ బాధ్యత అని గుర్తించండి. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం..
మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకునేందుకు ముందుగా www.nvsp.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇది నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్.
పైన లెప్ట్లో మీకు Search Your Name in Electoral Roll అని కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డు పైన EPIC నెంబర్ ఉంటుంది. EPIC ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. వెబ్ పేజీ చివర్లో మీ వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీ పేరు కనపించకపోతే మీరు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయినట్లే.
ప్రత్యామ్నాయంగా ‘Search by Details’ ద్వారా కూడా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







