రైల్వే ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు..
- April 08, 2019
వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న మినిస్టీరియల్ ఐసోలేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పొడిగించింది. మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై ఏప్రిల్ 7తో ముగియనుంది. అయితే దరఖాస్తు గడువు తేదీన ఏప్రిల్ 22 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్‌ఆర్‌బీ నిర్ణయం తీసుకుంది.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించి ఏప్రిల్ 22 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 28లోగా, ఎస్‌బీఐ/పోస్టాఫీస్ చలాన్ ద్వారా ఏప్రిల్ 26 మధ్యాహ్నం 1 గంటలోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల తుది సమర్పణకు ఏప్రిల్ 30ని తుదిగడువుగా నిర్ణయించారు.
రైల్వేలో మొత్తం 1665 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితిని నిర్ణయించారు. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్టెనోగ్రఫీ టెస్ట్, పెర్ఫార్మెన్స్ టెస్ట్/టీచింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంటరీ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్-జులై మధ్యకాలంలో అభ్యర్థులకు సీబీటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని తదుపరి పరీక్షలకు ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







