మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..

- April 08, 2019 , by Maagulf
మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..

ఎవరికి ఓటేస్తారో తరవాత సంగతి. ముందు మీకు ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా మూడు రోజులే ఉంది. మీరు చెక్ చేసుకోవడంతో పాటు మరికొంత మందికి ఈసమాచారాన్ని తెలియజేయండి. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరునిగా మీ బాధ్యత అని గుర్తించండి. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం..

మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకునేందుకు ముందుగా www.nvsp.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇది నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్.

పైన లెప్ట్‌లో మీకు Search Your Name in Electoral Roll అని కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా సెర్చ్ డీటెయిల్స్ ఆధారంగా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డు పైన EPIC నెంబర్ ఉంటుంది. EPIC ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే చాలు మీ ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. వెబ్ పేజీ చివర్లో మీ వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీ పేరు కనపించకపోతే మీరు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయినట్లే.
ప్రత్యామ్నాయంగా ‘Search by Details’ ద్వారా కూడా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. పేరు, ఏజ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, జిల్లా వివరాలు ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com