అతనే నిజమైన హీరో..
- April 08, 2019
కేరళ:సముద్రం ప్రశాంతంగా ఉంది. బీచ్‌కు వచ్చిన పర్యాటకులు అలలను చూస్తూ వాతావరణాన్ని అస్వాదిస్తున్నారు. ఇంతలో సముద్రంలో నుంచి ఓ వ్యక్తి కేకులు వేస్తూ కాపాడండి అంటూ అరుస్తున్నాడు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు అతన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. భారత నౌకా దళంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ రాహుల్ దలాల్ తన భార్యతో కలిసి అక్కడే ఉన్నారు. వెంటనే అతను రంగంలోకి దిగారు. ఈత కొట్టుకుంటూ వెళ్లి క్షణాల్లోనే బాధితుడుని చేరుకున్నారు. రాహుల్ అక్కడికి చేరుకునే సరికి బాధితుడు స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఓడ్డు చేర్చడానికి రాహుల్ చేస్తున్న ప్రయత్నానికి అతడు సహకరించలేకపోతున్నాడు. రిప్ కరెంట్ అధికంగా ఉండడంతో ఇద్దరినీ సముద్రం లోపలికి లాగేస్తుంది. దాదాపు 30 నిమిషాలు పోరాడి బాధితుణ్ని ఒడ్డుకు తీసుకువచ్చాడు రాహుల్.
- ADVT -
అప్పటికే అతడు పూర్తిగా స్పృహ కోల్పోయాడు. సముద్రం నాచు బాధితుని గోంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరి ఆడడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన రాహుల్ దాన్ని బయటకి తీసి ఊపిరి ఉదుతూ, గుండెలపై గట్టిగా ఒత్తాడు. గొంతు ఫ్రీ అయిపోవడంతో అతడు ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు.అంతలోనే అక్కడి చేరుకున్న పోలీసులు భాదితున్ని ఆస్సత్రికి చేర్చి చికిత్స అందించారు. భాధితున్ని ఔరంగాబాద్‌కు చెందిన దిలీప్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
రాహుల్ ధైర్యసాహసాలు అభినందిస్తూ భారత నావికా దళం ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్టులు పెట్టింది. ఘటన వివరాలను పోస్ట్‌లో తెలిపింది. అది పెట్టిన కొన్ని గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 21,000 లైక్‌లు వచ్చాయి. సోషల్ మీడియా ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. శభాష్ రాహుల్ అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు .
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







