మరోసారి ఘోర పరాజయం పాలైన సన్‌రైజర్స్
- April 09, 2019
సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఐఎస్ బృందా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటింగ్లో డేవిడ్ వార్నర్ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్ ఆడి 70 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం 151 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన పంజాబ్ జట్టు మరో బంతి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటింగ్లో రాహుల్ ,అగర్వాల్ అదరగొట్టేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







