తలైవా 167వ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- April 09, 2019
సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి ఓ మంచి చిత్రం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఆయన స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చిన సెట్స్ పైకి వెళ్ళేoదుకు చాలా టైం పట్టింది. నేటి నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసారు. 'దర్బార్' అనే టైటిల్ ని చిత్రానికి ఫిక్స్ చేసిన యూనిట్ ఫస్ట్ లుక్ లో రజనీకాంత్‌ని పవర్ఫుల్ గా చూపించారు. రజిని వెనుక తుపాకులు, బెల్ట్, బేడీలు కనిపిస్తున్నాయి. రెండు నెలలో చిత్రాన్ని పూర్తి చేయాలని మురుగదాస్ భావిస్తున్నాడట. నయనతార చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, అనిరుధ్ రవిచంద్రన్ మరోసారి రజనీకాంత్ చిత్రానికి స్వరాలు అందించేందుకు సిద్ధమయ్యారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇందులో రజనీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముంబయి నేపథ్యంలో సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌ను చూస్తే అర్థమవుతోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







