యెమెన్ పై విరుచుకుపడ్డ సౌదీ వాయుసేన
- April 09, 2019
సౌదీ వాయుసేన యెమెన్‌పై విరుచుకుపడింది. రాజధాని సనాలోని ఓ ప్రయివేట్ పాఠశాలకు సమీపంలోని మెటల్ షాప్‌పై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 11 మంది చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో బాలికల సంఖ్య అధికంగా ఉంది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మెటల్ షాప్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాగా, యెమెన్‌లోని సైనిక శిబిరాల లక్ష్యంగానే తాము దాడులకు పాల్పడినట్టు సౌదీ పేర్కొంది. చిన్నారులపై దాడులకు పాల్పడలేదని తెలిపింది. గతవారం సేవ్ చిల్డ్రన్ ఛారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని సౌదీ వాయుసేన దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. యెమెన్‌లో చిన్నారుల లక్ష్యంగా సౌదీ వాయుసేన జరిపిన వైమానిక దాడిపై ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..2015 నుంచి సౌదీ సంకీర్ణదళాలు యెమెన్‌లో జరిపిన దాడుల్లో 10వేల మృతిచెందారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







