సౌదీ చెక్‌ పాయింట్‌ వద్ద ఎన్‌కౌంటర్‌: ఇద్దరి హతం

- April 09, 2019 , by Maagulf
సౌదీ చెక్‌ పాయింట్‌ వద్ద ఎన్‌కౌంటర్‌: ఇద్దరి హతం

సౌదీ:ఖాతిఫ్‌ గవర్నరేట్‌ పరిధిలోని ఓ చెక్‌ పాయింట్‌ వద్ద సాయుధులైన దుండగులు భద్రతా సిబ్బందిపై దాడికి యత్నించగా, అందులో ఇద్దర్ని హతమార్చిన భద్రతా దళాలు, మరో ఇద్దర్ని సజీవంగా పట్టుకోవడం జరిగింది. ఈస్ట్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగినట్లు సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ పేర్కొంది. బహ్రెయిన్‌ అలాగే కువైట్‌ని కలిపే ఈస్టర్న్‌ ప్రావిన్స్‌లోని హైవేపై అబు హద్రియా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ సెక్యూరిటీ అథారిటీస్‌ అలాగే ప్రెసిడెన్సీ పర్సనల్‌ ఓ ఎస్‌యూవీ ద్వారా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులు వెళుతున్నట్లు గుర్తించి వారిని అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు కాల్పులకు దిగారు. దాంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపారు. నిందితులు వినియోగించిన వాహనం నుంచి పెద్దయెత్తున ఆయుధాల్ని స్వాదీనం చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com