పెన్షన్ ఎక్కువ కావాలనుకుంటున్నారా? అయితే..
- April 09, 2019
ప్రైవేట్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత ఈపీఎఫ్ నుంచి వచ్చే పెన్షన్ ఎక్కువ కావాలనుకుంటున్నారా? అయితే మీ పీఎఫ్ ఖాతా నుంచి జమయ్యే నగదు నిల్వ తగ్గబోతోంది. అవును ఎక్కువ పెన్షన్ కావాలనుకునే వారికి…ప్రతినెలా పీఎఫ్ ఖాతాలో జమయ్యే నగదు నిల్వలు తగ్గనున్నాయి. సంస్థ యజమాని.. ఉద్యోగి వాస్తవిక వేతనంపై 12 శాతం ఈపీఎఫ్‌వోకు జమ చేయాల్సి ఉండగా… ఇందులో 8.33 శాతం ఈపీఎస్‌కు….3.67 శాతం ఉద్యోగి ఖాతాకు వెళ్తుంది. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం పెన్షన్‌కు నిర్దేశించిన గరిష్ఠ వేతనం 15వేలుగా ఉన్నందున.. 8.33 శాతం అంటే రూ.1250 మాత్రమే ఇప్పటిదాకా ఈపీఎస్‌కు జమచేస్తుండగా….మిగతా సొమ్ము ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో వేస్తున్నారు. అధిక పెన్షన్ కోసం ఆప్షన్ ఇస్తే వాస్తవిక వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఎంతుంటే అంత ఈపీఎస్‌కు వెళ్తుంది. ప్రతి ఏడాది పెరిగే వేతనం మేరకు ఈ మొత్తం కూడా పెరుగుతుంది.
ఇప్పటికే పదవీ విరమణ చేసినవారికైనా, సర్వీసులో కొనసాగుతున్న వారికైనా అధిక వేతనం ఉంటే అప్పటి నుంచి వడ్డీతో సహా ఈపీఎస్ బకాయిలు ఈపీఎఫ్‌వోకు జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారికే అదనపు పెన్షన్ ప్రయోజనాలు దక్కనున్నాయి. తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దీనికి సంబంధించి ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయం రూపొందించే విధివిధానాల కోసం ప్రైవేటు రంగంలోని రిటైర్ ఉద్యోగులు.. ప్రస్తుత ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వేతనం 15వేలకు తక్కువగా ఉన్నప్పటికీ.. 2014 తరువాత పదవీ విరమణ చేసిన వారికి మేలు జరగనుంది. 2014 సెప్టెంబరు తరువాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌ను లెక్కించేప్పుడు చివరి ఐదు సంవత్సరాల సగటు వేతనం పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు చివరి ఏడాది వేతనం పరిగణనలోకి తీసుకోవాలని సూచించడంతో… ఆయా ఉద్యోగులకు పెన్షన్ పెరగనుంది.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







