"ఓటర్లు కొత్త రికార్డు క్రియేట్ చేయాలి" అంటూ ట్వీట్ చేసిన మోడీ
- April 11, 2019
ఢిల్లీ: ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు (ఏప్రిల్ 11)న తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్ధేశించి ట్వీట్ చేశారు. ఈ సారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలి దశ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లోని ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటింగ్‌లో సరికొత్త రికార్డు నమోదు కావాలి. ప్రత్యేకించి యువత, ఫస్ట్‌టైం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







