ఇల్లీగల్‌ ఫుడ్‌ ప్రిపరేషన్‌: వలసదారుల అరెస్ట్‌

- April 11, 2019 , by Maagulf
ఇల్లీగల్‌ ఫుడ్‌ ప్రిపరేషన్‌: వలసదారుల అరెస్ట్‌

అక్రమంగా ఫుడ్‌ని ప్రిపేర్‌ చేస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో వలసదారుల్ని అరెస్ట్‌ చేశారు. అల్‌ సీబ్‌లోని అల్‌ షరీగాలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమ ఫుడ్‌ తయారీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ మేరకు మస్కట్‌ మునిసిపాలిటీ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. మిషాకీక్‌ని తయారు చేసేందుకు వలస కార్మికులు ఓ ఇంటిని వినియోగిస్తున్నారనీ, ఇదే భవనాన్ని వారు నివాస స్థలంగానూ ఉపయోగిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అల్‌ సీబ్‌, అర్బన్‌ ఇన్‌స్పెక్షన్‌ యూనిట్‌ మరియు లీగల్‌ యూనిట్‌ సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com