ఎంబసీకి బస్‌ సౌకర్యం కల్పించాలి: కార్మికులు

- December 31, 2015 , by Maagulf
ఎంబసీకి బస్‌ సౌకర్యం కల్పించాలి: కార్మికులు

పార్శిఆమిక ప్రాంతంలోని తక్కువ ఆదాయం గల సింగిల్‌ వర్కర్స్‌ మెరుగైన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యాన్ని కోరుతున్నారు. ఉదయం వేళల్లో ఎంబసీకి వెళ్ళేందుకు సులువుగా సరైన బస్‌ సౌకర్యం కావాలని అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా ఆసియాకి చెందిన కార్మికులు, ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. మౌసలాత్‌ తమ అభ్యర్థనను మన్నించాలని వారు కోరుతున్నారు. బస్‌ సౌకర్యం లేకపోవడంతో సరైన సమయంలో ఎంబసీకి డాక్యుమెంట్లు సమర్పించలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా, శ్రీలంక ఎంబసీలకు వెళ్ళేందుకు ఒక్కోసారి కార్మికులు కాలినడకను ఆశ్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అధిక మొత్తం చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవలసి వస్తుంది. అలాగే వివిధ రూట్లలో ప్రయాణిస్తున్న సాధారణ పౌరులూ బస్‌ రూట్లను వివిధ ప్రాంతాలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com