ఢిల్లీతో ఢీ కొట్టేందుకు చంద్రబాబు సిద్ధం
- April 13, 2019
ఢిల్లీతో ఢీ కొట్టేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. కేంద్రం కక్ష పూరిత చర్యలు, ఈసీ వ్యవహార శైలిపై హస్తిన వేదికగా పోరాటం చేయనున్నారు. ఈ ఉదయం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఎన్నికలు నిర్వహించిన తీరుపై ఈసీని ప్రశ్నించనున్నారు టీడీపీ అధినేత. ఇదే సమయంలో వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేయనున్నారు.
ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? పోలింగ్ ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఆరు గంటలకు ముగిసే పోలింగ్ అర్థరాత్రి వరకు ఎందుకు సమయం పట్టింది? సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కల్పించకపోవడానికి కారణం ఏంటి? ఓటర్లు ఇబ్బందులు పడ్డ ఎందుకు పట్టించుకోలేదు? కీలక సమయంలో ముఖ్య అధికారులను ఎందుకు బదిలీ చేశారు? అన్న అంశాలపై సీఈసీని ప్రశ్నించనున్నారు చంద్రబాబు.
ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. అటు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేయనున్నారు. తీర్పును మరోసారి పున:సమీక్షించి కౌంటింగ్ సమయంలో 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలివ్వాలని కోరనున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపుతో ఫలితాలు ఆరు రోజులు ఆలస్యం అని ఈసీ చెప్పడం అబద్ధమని వాదిస్తున్న టీడీపీ అధినేత…ఈ అంశాన్ని కూడా అత్యున్నత న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
రాష్ట్రం ఎన్నికల నిర్వాహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అడిగేవారు లేరని ఈసీ ఇష్టప్రకారం చేసిందని తప్పుపట్టారు. ఈవీఎంల మొరాయింపుతో సీఈఓనే ఓటు వేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. రిపేర్ చేస్తామని ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. దాడులు జరుగుతాయని హెచ్చరించినా పట్టించుకోలేదని ఆరోపించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







