ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..
- April 13, 2019
నేవీలో చార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో డిప్లొమాతోపాటు తగిన అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్ 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. స్క్రీనింగ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టర్ (ఎన్ఏఐ) పరిధిలోని డిపోలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, డీఆర్డీవో ల్యాబ్స్, క్వాసీ మిలిటరీ విభాగాల్లోని పోస్టులలో నియమిస్తారు.
ఖాళీల వివరాలు..
మొత్తం పోస్టులు: 172
చార్జ్‌మ్యాన్ (మెకానిక్) : 103
చార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్ & ఎక్స్‌ప్లోజివ్) : 69
రిజర్వేషన్ ప్రాతిపదికన కొన్ని పోస్టులు భర్తీ చేస్తారు. వాటి వివరాలు.. యూఆర్-66, ఎస్సీ-31, ఎస్టీ-13, ఓబీసీ-46, ఈడ్ల్యూఎస్- 16
అర్హత: ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ కెమికల్ ఇంజనీరింగ్)
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష ద్వారా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.04.2019
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







