జలియన్‌వాలా బాగ్‌ మారణహోమానికి నేటితో వందేళ్లు

- April 13, 2019 , by Maagulf
జలియన్‌వాలా బాగ్‌ మారణహోమానికి నేటితో వందేళ్లు

జలియన్‌వాలా బాగ్‌ మారణహోమానికి నేటితో వందేళ్లు పూర్యయ్యాయి… అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్ అమర వీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు బ్రిటిష్‌ హైకమిషనర్‌ డోమినిక్ అస్కిత్… ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించారు అస్కిత్‌… వందేళ్ల క్రితం జరిగిన మారణ హోమం బ్రిటీష్‌-భారత చరిత్రలో అత్యంత దురదృష్టకరమని… ఆనాటి ఘటనకు క్షమాపణలు చెబుతూ విజిటర్స్‌ బుక్‌లో రాశారు అస్కిత్‌…

1919 ఏప్రిల్‌ 13న జలియన్‌వాలా బాగ్‌లో మారణహోమం జరిగింది… బైసాఖీ ఉత్సవాన్ని పురస్కరించుకొని జలియన్‌వాలా బాగ్‌ వద్ద వేలాదిమంది భక్తులు, ఆందోళనకారులు ఒక్కచోట చేరారు… దీనిని వ్యతిరేకిస్తూ అప్పటి బ్రిటీష్‌ ఆర్మీ కమాండర్‌ కల్నల్‌ రిజినాల్డ్‌ డయ్యర్‌ నిరాయుధులైన వారిపై తూటాల వర్షం కురిపించాడు… ఈ ఘటనలో దాదాపు వెయ్యిమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు… ఈ ఘటన జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా బ్రిటీష్‌ ప్రభుత్వం ఇటీవలే అక్కడి పార్లమెంట్లో క్షమాపణలు తెలిపింది… బ్రిటీష్‌ ఇండియా చరిత్రలో ఇదొక మాయని మచ్చగా పేర్కొన్నారు బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com