హెలికాప్టర్లను ఢీకొట్టిన విమానం
- April 14, 2019
నేపాల్:నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సమ్మిట్ ఎయిర్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ హెలిప్యాడ్‌లో నిలిపి ఉంచిన రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన అనంతరం అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విమానం లుక్లా నుంచి కాఠ్‌మండూకు వెళ్లాల్సి ఉండగా అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అవుతున్న విమానం రన్‌వేపై నుంచి అదుపుతప్పి హెలిప్యాడ్‌లో ఉన్న రెండు హెలికాప్టర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై రామ్ బహదూర్, కోపైలట్ ఢుంగానా అక్కడిక్కడే మృతి చెందారు. ఏఎస్సై బహదూర్ శ్రేష్ఠ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలొదిలరాని వైమానిక అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







