పుస్తక ప్రియులకు ఎయిర్‌టెల్ శుభవార్త
- April 14, 2019
ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ ద్వారా పుస్తకాలు చదివేలా ఓ యాప్‌ను రూపొందించింది. దేశంలోని స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఇ-బుక్స్ యాప్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ యాప్‌లో దాదాపు 70వేలకు పైగా పుస్తకాలను పొందుపరుస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఎయిర్‌టెల్ వినియోగదారులకు మాత్రమే అనుకుంటే అది మన పొరపాటే. కేవలం ఎయిర్‌టెల్ కస్టమర్స్ ఏ కాకుండా.. నాన్ ఎయిర్‌టెల్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై కూడా.. ఎయిర్‌టెల్ ఇ-బుక్స్ యాప్ లభిస్తుంది.
ఎయిర్‌టెల్ ఇ-బుక్స్ యాప్ ను ఏ కస్టమర్ అయినా సరే మొదటి 30 రోజులు ట్రయల్ పీరియడ్‌లో పుస్తకాలు చదవొచ్చు. ఆ తరువాత నుంచీ నెలవారీగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 6 నెలలకు అయితే రూ.129., 12 నెలలకు అయితే రూ.199 చెల్లించి ఈ యాప్ ద్వారా.. పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక ఎయిర్‌టెల్ కస్టమర్లయితే.. 5 పెయిడ్ పుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమకు కావల్సిన బుక్స్‌ను చదువుకోవడంతో పాటు కావాలని అనిపిస్తే వాటిని కొనుక్కోవచ్చు కూడా. ఇంకేంటి మరీ పుస్తక ప్రియులారా.. ఇక మీ ప్రయాణాల్లో విసిగిపోకుండా.. చక్కగా మీకు నచ్చిన పుస్తకాన్ని స్మార్ట్‌ఫోన్‌లో చదివుకోండి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







