శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం
- April 14, 2019
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయం లో అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దోహా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద అక్రమంగా తరలిస్తున్న 1,900 గ్రాముల బంగారం పట్టుబడింది. బంగారాన్ని లో దుస్తుల్లో దాచుకుని వస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.36,99,782 ఉంటుందని అంచనా వేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







