ఆ విషయంలో మహిళలదే పై చేయి

ఆ విషయంలో మహిళలదే పై చేయి

కువైట్‌ సిటీ: ఓ సర్వేలో కువైటీ మహిళలు, పురుషుల కంటే కాఫీ ఎక్కువగా తాగుతారని తేలింది. కాఫీ ప్రోడక్ట్స్‌కి సంబంధించిన న్యూట్రిషనల్‌ ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకునేవారు కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువ వున్నారట. 30 మంది పురుషులు ఇలా న్యూట్రిషనల్‌ విలువల గురించి తెలసుకుంటోంటే, 34 శాతం మహిళలు ఆ పని చేస్తున్నారు. కువైట్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫుడ్‌ సర్వీసెస్‌ మరియు న్యూట్రిషన్‌ ప్రొఫెసర్‌ అస్మా బస్తకి మరికొందరు విద్యార్థులు 1,483 మందిపై ఈ విషయమై సర్వే నిర్వహించారు. 18 నుంచి 35 ఏళ్ళ వయసున్నవారిని ఈ సర్వే కోసం ఎంచుకున్నారు. కువైటీలలో అత్యధిక శాతం మంది సేవించే కాఫీగా అమెరికానో సత్తా చాటింది. 13 శాతం మంది ప్రతిరోజూ కేఫ్‌లకు వెళుతుంటారనీ, 30 శాతం మంది నెలలో నాలుగు సార్లు వెళుతుంటారనీ, 26.6 శాతం పురుషులు, 23.2 శాతం మంది మహిళలు వారంలో ఒకటి నుంచి ఆరు సార్లు కేఫ్‌కి వెళుతుంటారనీ తేలింది. 51.4 శాతం మంది స్టార్‌బక్స్‌ కాఫీని ప్రిఫర్‌ చేస్తారట. 

 

Back to Top