రమదాన్ నోటీసులు జారీ చేసిన షార్జా మునిసిపాలిటీ
- April 16, 2019
షార్జా:షార్జా మునిసిపాలిటీ రెండు నోటీసుల్ని రమదాన్ నిమిత్తం జారీ చేసింది. ఫుడ్ హైజీన్ అలాగే వర్కింగ్ అవర్స్ విషయమై ఈ నోటీసుల్ని జారీ చేసినట్లు మునిసిపాలిటీ అధికారులు పేర్కొన్నారు. రెస్టారెంట్లు, కెఫిటేరియాలు మరియు బేకరీల్ని మినహాయించి మిగిలిన వర్క్ షాప్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వర్కింగ్ అవర్స్ పెంపుదలకు సంబంధించి ప్రత్యేకంగా అనుమతులకోసం అప్లయ్ చేసుకోవడం ప్రారంభించాలి. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభానికి ముందే దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. మరో నోటీసులో హైపర్ మార్కెట్స్, సక్రమ పద్ధతిలో ఫుడ్ స్టఫ్‌ని స్టోర్ చేసుకోవాలని, సప్లయ్ మరియు డిమాండ్‌కి తగ్గట్టుగా ఫుడ్ స్టఫ్‌ని అందుబాటులో వుంచేందుకు వీలుగా ఆయా ఏర్పాట్లు వుండాలని, అవసరమైన టెంపరేచర్లో ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేయాలని నోటీస్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







