ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం
- April 21, 2019
హైదరాబాద్:టాలీవుడ్ మెగా ఫ్యామిలీ కి సంబందించిన ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన లేదా ఏదైన ప్రత్యేకమైన రోజుల గురించి ముఖ్యంగా పండుగలు, మహిళా దినోత్సవం సందర్భంగా ఏదో ఒక మెసేజ్ తో మీడియాలో హల్ చల్ చేస్తుంది. తన భర్త ఎక్కడికైనా షూటింగ్ వెళితే అక్కడి లోకేషన్స్ షేర్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన షూట్స్ తో సందడి చేస్తుంది. అంతే కాదు ప్రకృతికి సంబంధించి, ఇతర సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది.
రామ్ చరణ్ భార్య ఉపాసన దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారం అందుకున్నారు. 'ఈ ఏటి మేటి పరోపకారి'గా ఉపాసనను ఎంపిక చేశారు. తన అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం లభించింది. దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. అయితే ఈ అవార్డు సమాజంలో దీనావస్థలో ఉన్నవారిని ఆదుకున్నందుకు, విభిన్న రంగాల్లో ప్రతిభావంతులకు, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డు అందిస్తున్నారు.
తాజాగా తనకు దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారం లభించడంపై ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. "నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు" అంటూ ఆమె ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







