శ్రీలంక:పేలుళ్లలో 52కు చేరిన మృతుల సంఖ్య
- April 21, 2019
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 25 మంది మృతిచెందినట్లు సమచారం. మరో 280 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు. ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక పార్థలనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్లు సమాచారం. మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్ స్టార్ హోటళ్లలో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. శ్రీలంకలోని భారత అధికారులతో మాట్లాడామన్నారు. దీనిపై మరికాసేపట్లో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే అత్యవసర సమాచారం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







