దుబాయ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలు

దుబాయ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలు

దుబాయ్:ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు త్యాగాన్ని తలచుకుంటూ క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. లోక రక్షణ కొరకు మరణించిన ఏసు కోసం ఉపవాసాలు ఉన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా దుబాయ్ లోని హోలీ ట్రినిటీ చర్చి లో క్రీస్తు నామ స్మరణలు మిన్నంటాయి. చర్చలో పాస్టర్ రేవ్ హారిసన్ చిన్నకుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్ధనలలో రమణ(మ్యానేజింగ్ డైరెక్టర్,సందీప్ గ్యారేజ్),ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top