అబుధాబి కుట్ర కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఐసిస్ లింకులు

అబుధాబి కుట్ర కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఐసిస్ లింకులు

అబుధాబి కుట్ర కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఐసిస్ లింకులు బయటపడుతున్నాయి. ఎన్‌ఐఏ విస్తృత తనిఖీలు జరిపి ఓ యువతిని అదుపులోకి తీసుకొంది. మహారాష్ట్ర వార్దాకు చెందిన మైమున అనే యువతిని అరెస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు తమ అదుపులో ఉన్న వ్యక్తులతో ఆమెకు లింక్‌ ఉన్నట్లు భావిస్తున్న ఎన్‌ఐఏ… పలువురు సానుభూతిపరులతో ఆన్‌లైన్‌ చాటింగ్‌ చేసినట్టు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

అబుధాబి కుట్ర కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఐసిస్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి అబుధాబి కేంద్రంగా ఐసిస్ కుట్ర చేస్తోంది. గత ఏడాదే కుట్రను చేధించిన ఎన్ఐఏ..కేసుతో సంబంధం ఉన్నట్లు భావించిన వ్యక్తులపై నిఘా పెట్టింది. ముంబయికి చెందిన మసూద్‌ తోహాజ్‌ ను అదుపులోకి తీసుకొని అతనిచ్చిన సమాచారంతో షహీన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లిలోనూ తనిఖీలు చేశారు. షహీన్‌నగర్‌కు చెందిన జీషాన్‌, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షిబ్లీ బిలాల్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ కార్యాలయంలో ప్రశ్నించిన అధికారులు..
సాయంత్రం వారిని వదిలిపెట్టారు. ఆదివారం కూడా మరోసారి మసూద్ తోహాజ్, జీషాన్, షిబ్లీ బిలాల్ ను ప్రశ్నించారు.

Back to Top