శ్రీలంక పేలుళ్ళలో దుబాయ్‌ రెసిడెంట్‌ మృతి

శ్రీలంక పేలుళ్ళలో దుబాయ్‌ రెసిడెంట్‌ మృతి

దుబాయ్‌: శ్రీలంక పేలుళ్ళలో దుబాయ్‌ రెసిడెంట్‌ ఒకరు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 61 ఏళ్ళ రజినా, షాంగ్రి లా హోటల్‌లో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కసార్‌గోడ్‌ నుంచి దుబాయ్‌కి వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారామె. వాస్తవానికి రజినా, శ్రీలంక జాతీయురాలు. పెళ్ళి తర్వాత ఆమె కేరళలో తన భర్త వద్దనే వుండేవారు. ఆ తర్వాత మిడిల్‌ ఈస్ట్‌లోని పలు దేశాల్లో కుటుంబంతో సహా నివసించారు. గత కొన్నాళ్ళుగా ఆమె కుటుంబం దుబాయ్‌లోనే స్థిరపడింది. రజినా, ఆమె భర్త శ్రీలంకలోని ఆమె సోదరుడు బషీర్‌ని, ఇతర కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వెళ్ళారు. అయితే ఇంతలోనే దురదృష్టకర ఘటన జరిగిపోయింది. బాధితురాలి పిల్లలు అమెరికాలో వుంటున్నారని కుటుంబ సభ్యుల్లో ఒకరైన బీరన్‌ చెప్పారు. 

Back to Top