సుల్తానేట్‌లోకి అక్రమ ప్రవేశం: వలసదారుల డిపోర్టేషన్
- April 23, 2019
మస్కట్: సుమారు 20 మంది ఆసియా వలసదారుల్ని దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన కారణంగా డిపోర్టేషన్ చేసినట్లు రాయaల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మొత్తం 18 మంది ఇన్‌ఫిలిట్రేటర్స్‌ని డిపోర్ట్ చేశామనీ, వారంతా ఆసియా జాతీయులేనని, సంబంధిత చట్టాలను బట్టి వీరిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు రాయల్ ఒమన్ పోలీసులు. ఆయా వ్యక్తులకు సంబంధించిన దేశాలతోనూ, ఎంబసీలతోనూ సంప్రదింపులు జరిపామని ఆ తర్వాతే చర్యలు తీసుకోవడం జరిగిందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 'వారి భద్రత, హక్కులను పరిగణనలోకి తీసుకుని, దేశం విడిచి వెళ్ళేంతవరకు వారికి అవసరమైన సాయం అందించి ఆ తర్వాతే వారిని డిపోర్టేషన్ చేశాం' అని అధికారులు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..