యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన యాక్టింగ్ స్కూల్ యజమాని అరెస్ట్
- April 23, 2019
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సూత్రధార యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో అతన్ని హాజరుపరిచారు. నిందితుడు వినయ్ వర్మ మీద సెక్షన్ 354 ఏ, 506, 509 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉండే సూత్రధార యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కు వినయ్‌వర్మ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నాడు. బాధితురాలితో పాటు ఎనిమిది మంది నటశిక్షణ తీసుకునేందుకు అందులో చేరారు. ఈ నేపథ్యంలో నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలంటూ 9 మంది యువతులతో అసభ్య ప్రవర్తించాడు వినయ్ వర్మ. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నారాయణ గూడ పోలీసులు.. వినయ్ వర్మను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







