సౌదీ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న విమానంలో విషాదం
- April 23, 2019
కాన్‌బెర్రా: ఓ మాజీ నర్సు సౌదీ నుంచి ఆస్ట్రేలియా పయనమైంది. తన వెనుక సీట్లో పసివాడి ఏడుపు వినిపించి.. ఆ జంట వద్ద నుంచి పిల్లాడిని తీసుకొని ఆడించింది. కాసేపటికి పిల్లాడు ఏడుపు ఆపడంతో వాడిని తల్లిదండ్రులకు అప్పగించింది. ఆ తర్వాత తన పనిలో తను మునిగిపోయింది. ఓ ఎయిర్‌హోస్టెస్ బలంగా తన భుజాన్ని కదపడంతో ఈ లోకంలోకి వచ్చి.. ఏం జరిగిందంటూ ఆ ఎయిర్‌హోస్టెస్‌ను ప్రశ్నించింది. వెనక సీట్లోని జంట చేతుల్లో పసివాడి మొహం రంగు మారడం చూపించిన ఆ ఎయిర్‌హోస్టెస్.. పసివాణ్ణి ఆ నర్సు చేతిలో పెట్టింది. ఆ పిల్లవాడు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని గుర్తించిన ఆ నర్సు.. విమానంలో ఎవరైనా డాక్టరున్నారా అంటూ కేకలేసింది. అలా అరుస్తూండగానే.. ఆమె కళ్లముందే ఆ పసివాడు ఊపిరి వదిలాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. సౌదీ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న ఎయిర్‌ఏసియా విమానంలో జరిగిన ఈ ఘటన తన హృదయాన్ని కుదిపేసిందని చెప్పింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..