రిచ్చెస్ట్‌ కంట్రీస్‌: కువైట్‌కి ఏడో స్థానం

- April 24, 2019 , by Maagulf
రిచ్చెస్ట్‌ కంట్రీస్‌: కువైట్‌కి ఏడో స్థానం

అమెరికన్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ ఫర్మ్‌ ఒకటి విడుదల చేసిన రిపోర్ట్‌లో కువైట్‌ ఏడవ రిచ్చెస్ట్‌ కంట్రీగా గుర్తింపు పొందింది. ఈ రేసులో తొలి స్థానాన్ని ఖతార్‌ దక్కించుకుంది. జిసిసి రీజియన్‌లోనూ ఖతార్‌ది తొలిస్థానం కాగా, కువైట్‌ రెండో స్థానంలో నిలిచింది. బలమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా కువైట్‌ ఈ ఘనత సాధించినట్లు ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఎకమనిక్‌ ఇండికేటర్స్‌లో పెరుగుదల, 8 శాతం ప్రూవెన్‌ రిజర్వ్స్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఆయిల్‌.. ఇవన్నీ కువైట్‌ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. అమెరికన్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఖతారీ పెర్‌ క్యాపిటా జీడీపీ 135 వేల డాలర్లుగా నిలిస్తే, కువైట్‌ 70 వేల డాలర్లుగా తేలింది. ఆర్థిక రంగంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్‌ కారణంగా గల్ఫ్‌ దేశాలు అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నట్లు పై నివేదిక స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com