మరో గ్రాండ్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌కి ఆతిథ్యమిచ్చిన కింగ్‌డమ్‌

- April 24, 2019 , by Maagulf
మరో గ్రాండ్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌కి ఆతిథ్యమిచ్చిన కింగ్‌డమ్‌

బహ్రెయిన్‌ టూరిజం అండ్‌ ఎగ్జిబిషన్స్‌ అథారిటీ (బిటిఇఎ) చేపడుతున్న చర్యలు అద్భుతమైన ఫలితాల్ని ఇస్తున్నాయి. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అలాగే ఇతర హ్యాపీ అకేషన్స్‌కి బహ్రెయిన్‌, ప్రపంచ దేశాల్లోని ప్రముఖులకు వేదికగా మారుతోంది. తాజాగా మరో గ్రాండ్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌కి బహ్రెయిన్‌ ఆతిథ్యమిచ్చింది. ఏప్రిల్‌ 21, 22 తేదీల్లో ఈ వెడ్డింగ్‌ సెర్మానీ అమ్వాజ్‌ ఐలాండ్స్‌లోని ఆర్ట్‌ రోటానా హోటల్‌లో జరిగింది. 200 మందికి పైగా అతిథులు ఈ వెడ్డింగ్‌కి హాజరయ్యారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం సకల సౌకర్యాల్ని కల్పించడంలో బహ్రెయిన్‌ టూరిజం అండ్‌ ఎగ్జిబిషన్స్‌ అథారిటీ & రపత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఎఫైర్స్‌ అలాగే బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ, ఎయిర్‌పోర్ట్‌ డ్యూటీ ఫ్రీ మార్కెట్‌, బహ్రెయిన్‌ నేషనల్‌ క్యారియర్‌ గల్ఫ్‌ ఎయిర్‌.. ఇలా అన్ని విభాగాలూ సంయుక్తంగా సహకరించడంతో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అనుకున్నదానికంటే బాగా జరిగిందని ఆయా వర్గాలు వెల్లడించాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com