కార్న్ దహీ కబాబ్

- May 14, 2015 , by Maagulf
కార్న్ దహీ కబాబ్

కావలసిన పదార్ధాలు:

  • పెరుగు                     - ముప్పావు లీటరు
  • మొక్కజొన్న గింజలు   - 1 కప్పు
  • ఉప్పు                       - తగినంత
  • పచ్చిమిర్చి తురుము    - 1 టేబుల్ స్పూను
  • ఉల్లి ముక్కలు            - 1 టేబుల్ స్పూను
  • అల్లం తురుము           - 2 టేబుల్ స్పూన్లు
  • పుదీనా తురుము        - 1 1/2 టేబుల్ స్పూను
  • జీలకర్ర పొడి                - 1/2 టీ స్పూను
  • ధనియాల పొడి           - 1/2 టీ స్పూను
  • మిరియాల పొడి          - 1/2 టీ స్పూను
  • జీలకర్ర                      - 1/2 టీ స్పూను
  • నెయ్యి                      - 1/2 కప్పు

 

చేయు విధానం:

  • పెరుగుని పల్చని బట్టలో వేసి నీళ్ళన్నీ పోయేలా చేయాలి.
  • మొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
  • బాణీలో 2 టీ స్పూన్లు నెయ్యి వేసి జీలకర్ర వేయాలి. తరువాత పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఉల్లి ముక్కలు, రుబ్బిన మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి.
  • ఇప్పుడు నీళ్ళు తీసిన పెరుగు వేసి సిమ్ లో నాలుగైదు నిమిషాలు ఉడికించి దించాలి.
  • ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా తురుము, ఉప్పు వేసి కలపాలి.
  • ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా తీసుకొని పట్టీల మాదిరిగా చేయాలి.
  • పాన్ లో నెయ్యి వేస్తూ వీటిని రెండువైపులా కాల్చి తీయాలి.

 

                                                                         --- జి. లీలావతి, విజయవాడ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com