లయన్ : రివ్యూ
- May 14, 2015
నటీనటులు: బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టే, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, గీత, జయసుధ, చలపతిరావు, చంద్రమోహన్, ప్రదీప్ రావత్, విజయ్‌కుమార్ తదితరులు.
చాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమా
దర్శకత్వం: సత్యదేవా
నిర్మాత: రుద్రపాటి రమణారావు
విడుదల తేదీ: 14 మే 2015
మంచి గాడ్సే గా బాలకృష్ణ పెర్ఫార్మన్స్ ఇంటర్వల్ బ్లాక్ - సినిమాటోగ్రఫీ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెడు ఓల్డ్ స్టొరీ లైన్ సాగదీసిన స్క్రీన్ ప్లే ఊహాజనితమైన నేరేషన్ బలవంతంగా ఇరికించిన సొల్లు కామెడీ చిరాకు తెప్పించే బాలయ్య త్రిష రొమాంటిక్ ట్రాక్ చాలా పాత్రలకి సరైన రూపం లేకపోవడం మెచ్యూరిటీ లేని డైరెక్షన్ సిబిఐ రోల్ ని సరిగా డిజైన్ చేసుకోకపోవడం ఎడిటింగ్ ఓపెన్ చేస్తే... ముంబైలోని రామ్ మనోహర్ హాస్పిటల్ మార్చురీ... చనిపోయాడు అని నిర్దారించిన శవం బతికి సడన్ గా పైకి లేస్తుంది. అతనే మన హీరో బోస్(బాలకృష్ణ). స్పృహలోకి వచ్చిన బోస్ ని అయోమయంలో పడేస్తూ అతను బోస్ కాదని, గాడ్సే అని.. గాడ్సే తమ కొడుకని జయసుధ - చంద్ర మోహన్ కథలోకి ఎంటర్ అవుతారు. బోస్ కి తన మనసేమో తను బోస్ అని చెప్తుంటే, చుట్టూ ఉన్నావారేమో గాడ్సే అంటుంటారు. గాడ్సే గురించి తెలుసుకోవడం కోసం బోస్ హైదరాబాద్ బయలుదేరుతాడు. అలా హైదరాబాద్ వచ్చిన బోస్ కి పలు విచిత్ర సంఘటనలు ఎదురవుతుంటాయి. తనకు తన తల్లితండ్రులు కనిపిస్తారు. కానీ వాళ్ళంతా తను ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తుంటారు. వాళ్లెందుకు అలా ప్రవర్తిస్తున్నారు తెలుసుకోవాలని ట్రై చేస్తున్న టైంలో బోస్ కి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏమిటి.? అసలు హాస్పిటల్లో బతికింది ఎవరు బోసా.? లేక గాడ్సేనా.? అసలు బోస్ ని ఎందుకు గాడ్సే గా మార్చారు.? బోస్ తల్లి తండ్రులు ఎందుకు అబద్దం చెప్పారు.? బోస్ చనిపోయి మార్చురీలో ఉండడానికి గల కారకులెవరు.? బోస్ - గాడ్సేలలో అసలు సిబిఐ ఆఫీసర్ ఎవరు.? బోస్ - గాడ్సేల గతం ఏంటి.? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మీరు లయన్ సినిమా చూడాల్సిందే.. లయన్ - నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమా.. కానీ పాడింగ్ కోసం ఈ సినిమాలో చాలా మంది నటీనటులనే పెట్టుకున్నారు. ఎవరెవరు ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ చేసారు, సినిమాకి ఎంత హెల్ప్ అయ్యారనేది చెబుతా.. ఒక్క బాలకృష్ణ గురించి తప్ప మిగతా అందరి గురించి సూటిగా సుత్తి లేకుండా ఒక్క వాక్యంలో చెప్పడానికి ట్రై చేస్తాను.. ముందుగా బాలకృష్ణ బోస్, గాడ్సే అనే రెండు పాత్రల్లో కనిపించాడు. బోస్ - ఈ పాత్రలో అరుపులు, మెరుపులు తప్ప మీకు ఇంకేమీ కనిపించవు. ఇక అరుపులు లేని సమయంలో పెర్ఫార్మన్స్ డీసెంట్ గానే ఉంది. గాడ్సే - ఈ పాత్రే ఈ సినిమాకి ప్లస్.. గాడ్సేగా బాలయ్య చేసిన రిస్కీ స్టంట్స్, చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. ఈ పాత్రలో బాలయ్య బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఇక మిగతా వారి విషయానికి వస్తే.. త్రిష పాత్ర ఐటెం గర్ల్ కి ఎక్కువ క్యారెక్టర్ ఆరిస్ట్ కి తక్కువ అన్నట్టు ఉంది. సినిమాలో పాటలకు, నాలుగైదు సీన్స్ కి తప్ప పెద్ద ఉపయోగంలేని పాత్ర. చాలా సీన్స్ లో క్యారెక్టర్ ఆరిస్టుల్లో ఒకరిలా వెనుక నిలవాల్సి వచ్చింది. రాధిక ఆప్టే పాత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ అన్నట్టు ఉంది. రాధిక ఆప్టేది కూడా జస్ట్ ఓ పాత్ర అంతే, పెద్ద ఉపయోగం లేదు. ఇద్దరూ గ్లామరస్ గా మెప్పించారు. జయసుధ, గీత, చంద్ర మోహన్ లు సెంటిమెంట్ సీన్స్ బాగా పండించడం వలన ఆన్ స్క్రీన్ ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. సినిమాకి మెయిన్ విలన్స్ గా చేసిన ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్ లు ఓకే అనిపించారు. ప్రకాష్ రాజ్ పాత్రల్లో కన్నింగ్, రౌడీయిజం అనేది ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండి ఉంటే సినిమాకి ఇంకాస్త హెల్ప్ అయ్యేది. పోసాని కృష్ణ మురళి ఒకే ఒక్క సీన్ లో యాజ్ యూజువల్ తన మార్క్ సెటైర్స్ తో ఆకట్టుకుంటాడు. అలీ, ఎంఎస్ నారాయణల చేత చేయించిన కామెడీ చాలా లేకిగా ఉంటుంది. ఈ కామెడీ నవ్వు తెప్పించకపోగా చిరాకు తెప్పిస్తుంది. అతిధి పాత్రల్లో కనిపించిన అర్చన, శివ బాలాజీ బాగా చేసారు. లయన్ సినిమాకి కర్త, కర్మ, క్రియ లేదా కెప్టెన్ అఫ్ ది షిప్ గా చెప్పుకునే వ్యక్తి ఒకరే అతనే మన కొత్త డైరెక్టర్ సత్య దేవ. ఈయన సీనియర్ డైరెక్టర్స్ దగ్గర పనిచేయడం వలన ఆ ట్రెండ్ లోనే ఉండిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ సినిమా కోసం ఎంచుకున్న పాత్రల్లో తప్ప కథా పరంగా కొత్త దనం చూపించాలని ట్రై చెయ్యలేదు. అంతే కాకుండా పాత్రలతో అయినా కొత్తగా కథా విస్తరణ చేసుకున్నాడా అంటే అదీ లేదు. ఇది పక్కన పెడితే నేరేషన్ మరియు స్క్రీన్ ప్లే విషయంలో ఏదో చేసేసి సినిమాని హిట్ చేసేద్దాం అనుకున్నాడు. రెగ్యులర్ కథకి టిపికల్ స్క్రీన్ ప్లే రాయాలనుకున్నాడు కానీ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. నేరేషన్ పరంగా సినిమా మొత్తం ఊహాజనితంగా ఉంటుంది. ఒక్క పది నిమిషాల తర్వాత సినిమాలు ఎక్కువగా చూసే లంగోటియా బ్యాచ్ కూడా సినిమాలో ఏం జరుగుతుందో చెప్పేయగలరు. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్పీడ్ గా మొదలై, మధ్యలో స్లో అయ్యి బోర్ కొట్టిస్తుంది, ఎంతలా అంటే ఎండకి వడదెబ్బ తగిలిన వారిలా ఉంటది ఆడియన్స్ పరిస్థతి, మళ్ళీ కాసేపు ఊపు ఊపి ఊహాజనితంగా మార్చేయడంతో ఒక ఫైట్ పెట్టేయండి మాస్టారు సినిమా అయిపోద్ది ఇంటికి పోతాం అనే ఫీలింగ్ కి వచ్చేస్తారు ఆడియన్స్. వీటన్నిటికీ కారణం.. సత్య దేవ కి దర్శకత్వంలో మెచ్యూరిటీ లేకపోవడమే.. ఏ సీన్ ని ఎలా చెయ్యాలి, ఎంత మోతాదులో చేయించుకోవాలి, ఏ డైలాగ్ ని ఏ పిచ్ లో చెప్పించుకోవాలి, అసలు ఈ సీన్ వీళ్ళకి సెట్ అవుతుందా లేదా అనే ఐడియా లేకపోవడం ఈ సినిమాని చాలా వరకూ దెబ్బ తీసింది. ఉదాహరణకి .. బాలయ్య స్టార్ హీరో ఒప్పుకుంటాం, డైలాగ్ ఎలా చెప్పాలో బాగా తెలుసు కానీ మీ కథలో ఏ సీన్ కి ఎంత మోతాదులో డైలాగ్ డెలివరీ ఉండాలి, ఎలాంటి మానరిజమ్స్ ఉండాలి అన్నది దర్శకుడే చూసుకోవాలి. కానీ ఆయనలో ఆ విషయాలపై పట్టులేకపోవడం వలన చాలా సీన్స్ లో కంటెంట్ ఉన్నా ఆన్ స్క్రీన్ తేలిపోయాయి. అలాగే ఆయన చేసిన చాలా సీన్స్ పలు ఇతర భాష సినిమాల నుంచి కాపీ కొట్టినవి. లాజికల్ గా చూసుకుంటే.. సిబిఐ ఆఫీసర్ గా అసలు చార్జ్ కూడా తీసుకోకుండానే ఓ ఫేమస్ పర్సన్ ఇంటికి వెళ్లి బాలయ్య ఎలా రైడ్ చెయ్యగలిగాడు.. అలాగే వారిని అక్కడే చంపేస్తే ఎవరూ పట్టించుకోరా.? ఇంద్రజ ఎలా ఒక సిబిఐ ఆఫీసర్ స్టేటస్ ని మార్చగలిగింది, తనకి ఆ పవర్స్ ఎక్కడ నుంచి వచ్చాయి. వాలంటరీ రిటైర్ మెంట్ కోసం బాలయ్య ఫ్యామిలీ దగ్గర సైన్ ఎలా తీసుకుంటారు.? ఇలా మొదలైన సీన్స్ చాలా ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకి టెక్నికల్ గా హెల్ప్ అయిన వారిలో వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ ని బాగా షూట్ చేసాడు. కొన్ని చోట్ల బాలకృష్ణ పోస్టర్స్ ని చాలా బాగా చూపించాడు. మణిశర్మ అందించిన పాటలు డిజాస్టర్.. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్ గా ఇచ్చాడు. సినిమాకి చాలా సీన్స్ లో హెల్ప్ అయ్యింది నేపధ్య సంగీతమే.. ఇక ఎన్నో జాగ్రత్తలు తీసుకొని రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ మెప్పిస్తాయి. ముఖ్యంగా గాడ్సే కి డిజైన్ చేసిన ఎపిసోడ్స్, రంపచోడవరం ఫారెస్ట్ లో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అయ్యాయి. ఎడిటర్ గౌతమ్ రాజు తన సీనియారిటీని ఉపయోగించి సాగ దీసిన సీన్స్ ని, కథని పక్కదారి పట్టిస్తున్న సీన్స్ ని కత్తిరించి ఉంటే బాగుండేది. రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మాణ విలువలు హై రేంజ్ లోనే ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కి ఎక్కువ ఖర్చు చేసారు. అందుకే లయన్ సినిమాకి అవి హైలైట్ గా నిలిచాయి.
రేటింగ్: 2.25/5
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







