టిక్ టాక్ అభిమానులకు గుడ్ న్యూస్..
- April 24, 2019
చైనీస్ యాప్ టిక్ టాక్ అతి తక్కువ కాలంలోనే నెటిజన్స్ మనసు దోచుకుంది. టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ.. హల్చల్ చేశాయి. దీంతో ఈ
యాప్ పాపులారిటీ సంపాదించింది. అయితే ఆశ్లీలత, విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు ఉన్నాయన్న కారణంగా మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 3న భారత్‌లో టిక్ టాక్ యాప్
డౌన్‌లోడ్‌ను బ్యాన్ చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.
కోర్టు ఆదేశాలపై టిక్ టాక్ రూపకర్త బైటెడెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు
వైఖరేంటో ఏప్రిల్ 24వ తేదీలోగా స్పష్టం చేయాలని సూచించింది. అప్పటికి హైకోర్టు నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే ఆ న్యాయస్థానం ఇచ్చిన నిషేధ ఆదేశాలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేస్తు మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







