మరో దేశాధ్యక్షుడితో కిమ్ జోంగ్ ఉన్ సమావేశం
- April 25, 2019
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన సమావేశం కానున్నారు. మొట్టమొదటిసారి ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అవుతున్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందాలపై సంతకాలు చేయడం కానీ, సంయుక్త ప్రకటన చేయడం వంటి అంశాలపై కానీ.. ముందుగా ప్రణాళికలు వేసుకోలేదు. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి రష్యాకు కిమ్.. ప్రత్యేక రైలులో వచ్చారు. ఉత్తరకొరియా సరిహద్దు ప్రాంతం ఖాసన్లోని రైల్వే స్టేషన్ నుంచి రష్యాలోని వ్లాదివోస్తోక్లోకు తొమ్మిది గంటల్లో చేరుకోవచ్చు. ఆయన రష్యాకు చేరుకోగానే ఆ దేశ అధికారులు తమ సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వాగతం పలికారు.
అణ్వాయుధ సమస్యపై అమెరికా, ఉత్తరకొరియా మధ్య రెండుసార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ గతేడాది మొదటిసారి సింగపూర్‌లో తొలిసారి భేటీ అయ్యారు. రెండోసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో వియత్నాంలోని హనోయిలో చర్చించారు. అయితే, ఏ నిర్ణయమూ తీసుకోకుండానే చర్చలు ముగిశాయి. ట్రంప్‌తో ముచ్చటగా మూడోసారి సమావేశం కావడానికి తాను సిద్ధమని, అయితే, అమెరికా కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల కిమ్ ప్రకటించారు. గతంలో ఆయన ట్రంప్‌తో భేటీ కావడానికి ముందు, ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ప్రపంచంలో తాము ఒంటరిగా లేమన్న సందేశాన్ని ఇవ్వడానికి కిమ్ ఇతర దేశాల అధ్యక్షుడితో భేటీ అవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







