ఒక్క బటన్ క్లిక్‌తో దుబాయ్ పోలీసుల్ని రీచ్ అవ్వొచ్చు
- April 25, 2019
దుబాయ్ పోలీస్, ఓ స్మార్ట్ డివైజ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ డివైజ్ ద్వారా ఒక్క బటన్ క్లిక్‌తోనే దుబాయ్ పోలీస్ ఆపరేషన్స్ రూమ్‌కి అనుసంధానమవ్వొచ్చు. ఎస్‌పిఎస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఎమర్జన్సీ ఫోన్ టవర్ వుంటుంది. అల్ రిగ్గా ప్రాంతంలో దీన్ని ఇప్పటికే అమర్చి, పరిశోధిస్తున్నారు. అల్ మురాక్కాబాత్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలి ఘానిమ్ మాట్లాడుతూ, అన్ని టెస్టులూ పాస్ అయితే ఎస్‌పిఎస్ ఎక్స్‌ప్రెస్‌ని ఎమిరేట్ వ్యాప్తంగా ఎయిర్ పోర్టులు, పార్కులు, సౌక్స్ మరియు ప్రముఖ లొకేషన్లలో ఏర్పాటు చేస్తామని అన్నారు. అత్యవసర సమయాల్లో పోలీసులకు సమాచారమందించడానికి ఈ స్మార్ట్ డివైజ్ ఎంతగానో ఉపయోగపడ్తుందని అధికారులు పేర్కొన్నారు. హెచ్‌డి సిఎంఓఎస్ కెమెరా, నైట్ విజన్, వీడియో మరియు ఆడియో టాక్ ఫీచర్స్, రిమోట్ మానిటర్ మరియు బ్రాడ్ కాస్ట్, అలార్మ్ ఇంటిగ్రేషన్, ఎక్సెలెంట్ వండల్ ప్రూఫ్ ఐపి65 మరియు ఐకె 10 కలిగి వుంటుంది ఈ డివైజ్. 4జి ఎల్‌టియి, వైఫై కనెక్షన్స్ మాడ్యూల్స్ కూడా వుంటాయిందులో.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







