రూఫ్‌లెస్ లైఫ్: ఎట్టకేలకు స్వదేశానికి సులేమాన్
- April 25, 2019
మనామాలోని ఓ భవనం టెర్రాస్‌పై అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతున్న సులేమాన్ అనే భారతీయ వలసదారుడి కష్టాలు తీరుతున్నాయి. అతన్ని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. రేపు ఆయన్ని స్వదేశానికి పంపనున్నారు. పదేళ్ళుగా సులేమాన్ బహ్రెయిన్‌లో నివసిస్తున్న సంగతి తెల్సిందే. బాధితుడి వెతల్ని తెలుసుకున్న పలు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అతనికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొచ్చాయి. కెఎంసిసి బహ్రెయిన్ శాఖ, అతన్ని స్వదేశానికి పంపేందుకు తనవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ట్రావెల్ బ్యాన్‌ని రద్దు చేసి, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కూడా లభించిందతనికి. కాగా, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న తనకు సహాయ సహకారాలు అందించాలని సులేమాన్ కోరుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







