దివ్యాంగ క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందించిన కేటీఆర్
- April 26, 2019
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ దివ్యాంగ క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం మూడుచింతల తండాకు చెందిన ధీరావత్ మహేశ్ దివ్యాంగ క్రీడాకారుడు. త్వరలో చైనాలో జరిగే ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలకు మహేశ్ ఎంపికయ్యాడు. అలాగే పారా క్రికెట్ ఇండియా టీమ్ వైస్‌కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. మే నెలలో చైనాలో బీచ్ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. అయితే మహేశ్‌కు అక్కడికి వెళ్లడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ మహేశ్‌కు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిచారు. తనకు సాయం అందించిన కేటీఆర్‌కు మహేశ్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







