తెలుగు, తమిళంలో సందీప్ కిషన్ `తెనాలి రామకృష్ణ బి.ఎ., బి.ఎల్... మే 7న ఫస్ట్ లుక్
- April 26, 2019
సందీప్ కిషన్ నటిస్తున్న చిత్రం `తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్`. తెలుగు, తమిళంలో ఏక కాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మే 7న విడుదల కానుంది. తెలుగు, తమిళంలో ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక నాయికగా నటిస్తున్నారు.
పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది.
60 శాతం చిత్రీకరణ పూర్తయింది. తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సినిమాతో తెలుగులోకి పరిచయమవుతున్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
`తెనాలి రామకృష్ణ బీఏబీఎల్`కు సాయికార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక సమయంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
నటీనటులు:
సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి, రఘు బాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ, సత్యకృష్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీశ్
సంస్థ: శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్
సమర్పణ: ఇందుమతి శ్రీనివాసులు
కథ: టి. రాజసింహ
సంగీతం: సాయికార్తీక్
కెమెరా: సాయి శ్రీరామ్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
మాటలు: నివాస్, భవానీ ప్రసాద్
స్క్రీన్‌ప్లే: రాజు, గోపాల కృష్ణ
ఆర్ట్: కిరణ్
యాక్షన్: వెంకట్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







